యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కాలపల్లి, తిర్మలాపూర్ గ్రామాల్లో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఏపీడీ శ్యామల పర్యటించారు.
ముందుగా ముల్కాలపల్లి గ్రామంలో పర్యటించిన వారు.. భూమి చదును పనులు,ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా పెంచిన మామిడి తోటలు, పశువుల పాకలను పరిశీలించారు.
అనంతరం తిర్మలాపూర్ గ్రామంలో పర్యటించి గొలుసు కట్టు చెరువులో ఉపాధి హామీ పనులు, చిన్న నీటి కుంట పనులను, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.