యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా పనులు కోల్పోయిన కార్మికులందరికీ నెలకు రూ.10వేల చొప్పున 6 నెలలపాటు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశ బడ్జెట్లో వైద్య రంగానికి 5 శాతం చొప్పున కేటాయించి కరోనా బారిన పడిన పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర పన్నులు రద్దుచేసి వాస్తవ ధరలకే పెట్రోల్, డీజిల్‌లను అందించాలని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ, తదితర కార్మికులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. లాక్డౌన్ కాలంలో కరెంటు బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.