యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లి కాలనీలో తాళం వేసి ఉన్న బద్దం కృష్ణగౌడ్ ఇంట్లో చోరీ జరిగింది. తన బావమరిది దశ దినకర్మకని ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని మహబూబ్పేటకు వెళ్లారు కృష్ణగౌడ్. సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా.. బీరువా తలుపులు తెరిచి, దుస్తులు, వస్తువులు, చిందర వందరగా పడేసి, ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఉన్నాయి.
అనుమానం వచ్చిన కృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. బీరువాలో ఉన్న 12 తులాల బంగారు, కిలోన్నర వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న యాదగిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..