ETV Bharat / state

ఒకప్పుడు నష్టాల్లో ఉన్న 'సొసైటీ' ఇప్పుడందరికీ ఆదర్శమైంది - yadadri bhuvanagiri district today news

సమష్టి కృషి ఉంటే రైతులతోపాటు సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘం బాగుంటే.. పంట రుణాలతో పాటు, ఎరువులు, విత్తనాలు తక్కువ ధరతో సకాలంలో రైతులకు అందుతాయి. ఇదే పంథాను పాటించిన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి బాటలో నడుస్తోంది. పలు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

The once distressed 'society' is ideal for all at mothkur yadadri bhuvanagiri
ఒకప్పుడు నష్టాల్లో ఉన్న 'సొసైటీ' ఇప్పుడందరికీ ఆదర్శమైంది
author img

By

Published : Feb 10, 2020, 4:19 PM IST

ఒకప్పుడు నష్టాల్లో ఉన్న 'సొసైటీ' ఇప్పుడందరికీ ఆదర్శమైంది

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి బాటలో నడుస్తోంది. 1977లో ఉమ్మడి నల్గొండలో ఉన్నప్పుడు నాగార్జున గ్రామీణ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఈ సంఘం ఏర్పడింది. 1991 నుంచి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాయంతో ముందుకెళ్లింది. మోత్కూరు మండలంలోని 13 గ్రామాలను దత్తత తీసుకొని సేవలు విస్తృత పరిచింది. ఈ సంఘంలో 11 వేల మంది రైతులు సభ్యులుగా ఉండగా, అందులో 3,035 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు ఏడు పాలక వర్గాలు సంఘం అభివృద్ధికి కృషి చేశాయి. సంఘంలో రెండెకరాల కమర్షియల్ భూమి, సుమారు ఐదు కోట్ల రూపాయల ఆర్థిక వనరులను ఉన్నాయి.

11 సార్లు సందర్శించి అధ్యయనం చేసి

సుమారు 20 లక్షల రూపాయల నష్టంతో వరుస పరాజయాలతో ముందుకు సాగింది. ఆ తరుణంలో ఈ సంఘాన్ని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారు ఆదీనంలోకి తీసుకుని అభివృద్ధి పరచడానికి పాలకవర్గంతో చర్చించి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1995లో మోత్కూరు రైతు సహకార సంఘం(సింగిల్​ విండో) ఛైర్మన్​గా కంచర్ల రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ముల్కనూరు సొసైటీని 11 సార్లు సందర్శించి అధ్యయనం చేసి మోత్కూరు సంఘం అభివృద్ధికి నాంది పలికారు. అనంతరం సంఘం నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలకు రుణాలు ఇస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.

ఎరువుల కోసం రుణాలు

రాష్ట్రంలో మొదటిసారిగా రైతులకు ఎరువుల కోసం సంఘం నుంచి రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంఘంలోని రైతులు అకాల మరణం సంభవిస్తే దహన సంస్కారాలకు సోసైటీ నుంచి రూ. 10 వేలు అందిస్తున్నారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులను చేస్తున్నారు. సంఘంలో 1200 మంది రైతులకు 4.5 కోట్ల పంట రుణాలు, 70 మంది రైతులకు రూ. 35 లక్షలతో మోటారు సైకిళ్లు, 72 మంది చిరు వ్యాపారులకు రూ. 40 లక్షల రుణాలు ఇచ్చారు. బంగారు ఆభరణాలపై రుణాలు, రైతులకు మోటారు సైకిళ్ల కొనుగోలు రుణాలు ఇస్తూ.. ఇప్పటికీ రెండున్నర కోట్ల రూపాయల లాభంతో సంఘం అభివృద్ధి బాటలో దూసుకెళుతోంది. నల్లగొండ జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది.

సంఘం పరిధిలోని గ్రామమైన దత్తప్పగూడెం రహదారిపై రైతుల వినియోగం కోసం డీజిల్, పెట్రోల్​ బంక్ త్వరలో ప్రారంభించనున్నారు. సొంత స్థలంలో ఎనిమిది వ్యాపార దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ సహకార సంఘంలో త్వరలో జరగనున్న ఎన్నికల తరువాత మంచి పాలకవర్గం రావాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.