యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని శ్రీ గాయత్రి మిల్లులో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.
చలికాలం తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు పత్తిని ఎండకు ఆరబెట్టి తెస్తే మంచి ధర పొందవచ్చన్నారు. వర్షాల వల్ల పత్తి కొద్దిగా నల్లగా ఉన్నప్పటికీ... రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : వైరల్: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికి హత్య