హోమ్ వర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ఉపాధ్యాయురాలు దండించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థి నోట్ బుక్ పోయింది. మళ్ళీ కొత్త నోట్ బుక్ లో తనకు వీలైనంత రాసి టీచర్‌కి చూపించాడు. మొత్తం రాయలేదంటూ టీచర్ విద్యార్థిని దండించగా.. అతని కంటికి గాయమైంది. ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిని దండించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు స్కూల్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. స్కూల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
ఇవీ చూడండి: బావిలో దూకి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య