ETV Bharat / state

'కష్టపడి చదివితే ఇంటికో అంబేడ్కర్​ అవతరిస్తాడు'

విజ్ఞానం ఎవరి సొత్తు కాదని, కష్టపడి చదివితే ఇంటికో అంబేడ్కర్​ అవతరిస్తాడని తెలంగాణ గురుకుల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్​కుమార్​ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్వేరో సర్కిల్​ను ఆయన ప్రారంభించారు.

యాదాద్రిలో స్వేరో సర్కిల్​ ప్రారంభం
author img

By

Published : Nov 3, 2019, 7:47 PM IST

యాదాద్రిలో స్వేరో సర్కిల్​ ప్రారంభం

పేద ప్రజలు స్వేరో సర్కిల్​లో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని తెలంగాణ గురుకుల పాఠశాలల ప్రధాన కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్వేరో సర్కిల్​ను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్వేరో సెంటర్​కు పంపి, వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

అనంతరం మోత్కూరులోని సంక్షేమ గురుకులాలను సందర్శించారు. వసతులు, విద్యార్థుల చదవు గురించి ఆరా తీశారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

Intro:Contributor :Anil
Center :Tungaturthi
Dist :Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మున్సిపాలిటీ కేంద్రంలో స్వేరో సర్కిల్ ను తెలంగాణ గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విజ్ఞానం ఎవరి సొత్తు కాదని కష్టపడి మీ పిల్లలు చదివిస్తే ఇంటికో అంబేద్కర్ అవతరిస్తాడని అన్నాడు.
తల్లి గర్బంలోనే అభిమణ్యుడు విద్యను అభ్యసించినట్లు మీ పిల్లలు ఇంటి నుంచే విద్యను అభ్యసించేలా చేయాలని కోరారు . ఇంట్లో, వీధుల్లో గోడల పై చెత్త రాతల తో నింపే కంటే విజ్ఞాన సంబందింఛిన రాతలు, బొమ్మలు వేసి పిల్లల మనస్సులో విజ్ఞానాన్ని నింపాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్దలు ఈ స్వేరో సర్కల్ లో విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని అందుకు తల్లిదండ్రలు తమ పిల్లలను సెంటర్ కు పంపి వారి అభివృద్దికి సహకరించాలని, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మీ పిల్లలపై రుద్దకుండా ఉన్నత ఆశయాల తో వారిని పెంచాలని, మోత్కురు నుంచి చదివిన వీరందరు భవిశ్యత్తులో ఖండాలు దాటి గ్రామం, దేశం పేరు నిలపాలన్నదే స్వేరో ఉద్దశంమన్నారు.
అనంతరం మోత్కురు సోషల్ వెల్ ఫేర్ గురుకుల పాఠశాల కు వెళ్ళి విద్యార్దుల వారి చదువు గురించి పాఠశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
గురుకులాల్లొ చదివే విద్యార్థుల కు నాణ్యమైన చదువు తోపాటు వసతులు కూడ కల్పిస్తున్నామన్నారు .విద్యార్థుల కు ఎలాంటి సమస్యలున్నా తమకు తెలపాలని అన్నా‌రు.Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.