యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దత్తత ఆలయమైన సుంకిశాల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు అధ్యయనోత్సవాలు, తోళక్కం, ప్రబంధ పారాయణం జరగనున్నాయి. ఈ నెల 24న పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి తిరుకల్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఇవీచూడండి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై