తెలంగాణలోని గురుకులాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం సమ్మర్క్యాంపు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన గురుకుల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో విద్యార్థులకు నృత్యాలతో పాటు, చిత్రలేఖనం, వేదిక్ మ్యాథ్స్ వంటివి నేర్పిస్తున్నారు.
ఆనందంగా ఉంది
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా శిక్షణ తీసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. చిత్రలేఖనం, నృత్యాలలో నిపుణులైన అధ్యాపకులతో తర్ఫీదు ఇస్తున్నారు.
240 మందికి శిక్షణ
ప్రస్తుతం 240 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా శిక్షణ శిబిరంలో ఉన్నారని ప్రిన్సిపల్ ఆచార్య తెలిపారు. ఏటా సర్వేల గురుకుల పాఠశాలలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు వచ్చి సెలవులను సద్వినియోగం చేసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: పీకల్లోతు వరకు మట్టిలో... ఖమ్మం యువత వినూత్న దీక్ష