Yadadri Maha Sudarshan Yagam Postponed: యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగమైన.. శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా పడింది. వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న క్రతువును వాయిదా వేస్తున్నట్లు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు వెల్లడించారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానుందనే వాయిదా వేశామని వెల్లడించారు. ఆలయ ఉద్ఘాటన తరువాత కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయి.
యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు కానుంది. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం చేపట్టి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని కిషన్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం పంచనారసింహులు, ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు, భక్తుల ఆర్జిత సేవలు సాగుతున్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేపట్టనున్నట్లు ఆలయ ఈవో గీత వివరించారు.
"క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానుందనే శ్రీ సుదర్శన మహా యాగం వాయిదా వేశాం. ఆలయ ఉద్ఘాటన తరువాత నిర్వహించే అవకాశాలున్నాయి. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు కానుంది. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం చేపట్టి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తాం. ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి."
- కిషన్ రావు, యాడా వైస్ ఛైర్మన్
ఇదీ చదవండి: Budget Session: 2022-23 బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లు..?