ETV Bharat / state

'శ్రావణి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి' - శ్రావణి హత్య కేసు

మైనర్ బాలిక శ్రావణి అనుమానాస్పద మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని భువనగిరి రహదారిపై ఆమె బంధువులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపించారు. బంధువుల నిరసనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

శ్రావణి హత్యకేసు
author img

By

Published : Apr 27, 2019, 4:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్​లో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి కుటుంబ సభ్యులు, బంధువులు భువనగిరి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆందోళనకారుల నిరసనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని శ్రావణి బంధువులు ఆరోపించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.
మేడ్చల్​ జిల్లా కీసరకు చెందిన శ్రావణి గురువారం ప్రత్యేక తరగతులకని వెళ్లి అదృశ్యమైంది. గాలింపు చేపట్టగా గ్రామ శివారులోని బావిలో మృతదేహం లభ్యమైంది.

శ్రావణి బంధువుల రాస్తారోకో

ఇదీ చదవండి : నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తాం: గొంగిడి సునీత

Intro:TG_NLG_61_27_SRAVANIBANDUVALA_ANDOLANA_AB_C14

యాంకర్ : బొమ్మలరామారం మండలం హాజీపూర్ కి చెందిన శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే . నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి కి శ్రావణి మృతదేహాన్ని తరలించారు .ఈరోజు ఉదయం శ్రావణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో శ్రావణ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల రోదనలతో మిన్నంటింది. నిందితులను కఠినంగా శిక్షించాలని , పోలీసులు సరిగా స్పందించలేదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని , ఆసుపత్రి ముందు ఉన్న జాతీయ రహదారిపై మృతురాలి బంధువులు ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారి ఇరువైపులా వాహనాల రాకపోకలకు కొద్దిసేపు ఇబ్బంది కలిగింది .

Body:భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ని మార్చురీలోఉన్న శ్రావణి మృతదేహాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరిశీలించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామని, కుటుంబానికి న్యాయం చేస్తామని వారికి ఎమ్మెల్యే గొంగిడి సునీత హామీ ఇచ్చారు. శ్రావణి మృతదేహం ఆసుపత్రి నుంచి స్వగ్రామం కు పంపే క్రమంలో ఆసుపత్రి గేట్ వద్ద మహిళ సంఘము ఆధ్వర్యంలో అంబులెన్సు ను అడ్డుకున్నారు. పోలీసులు నచ్చచెప్పటం తో ధర్నా విరమించారు.పటిష్ట భద్రత మధ్య మృతదేహాన్నీ స్వగ్రామం తరలించారు.

బైట్ : యశోద (మృతురాలి చిన్నమ్మ )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.