ETV Bharat / state

శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చేస్తాం: రాచకొండ సీపీ - BOMMALARAMARAM

మొన్న శ్రావణి, నిన్న మనీషా, నేడు కల్పన... ఈ వరుస హత్యలన్నీ శ్రీనివాసరెడ్డే చేశాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ నిర్ధారించారు. మొత్తం నాలుగు కేసుల్లో శ్రీనివాస్​రెడ్డి నిందితుడిగా ఉన్నాడని... ఉరిశిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు.

sravani-murder
author img

By

Published : Apr 30, 2019, 8:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హాజీపూర్​లో వరుస హత్యలు శ్రీనివాసరెడ్డే చేశాడని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ నిర్ధారించారు. నిందితుడు ముగ్గురిని అత్యాచారం చేసిన అనంతరం హత్యచేసి బావిలో పూడ్చిపెట్టాడని పేర్కొన్నారు. 2017లో కర్నూల్​లో సెక్స్​వర్కర్​ హత్యకేసులో అరెస్టు అయ్యాడని స్పష్టం చేశారు. 2015లో బొమ్మలరామారంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ శ్రీనివాస్​ను... గ్రామస్థులంతా పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారని తెలిపారు. అప్పటి నుంచి అతను ఉన్మాదిగా మారి బాలికలపై అత్యాచారం, హత్యలకు పాల్పడుతున్నాడని సీపీ వివరించారు. మొత్తం నాలుగు కేసుల్లో శ్రీనివాస్​రెడ్డి నిందితుడిగా ఉన్నాడని, అతనికి ఉరిశిక్ష పడేలా కృషి చేస్తామని సీపీ ప్రకటించారు.

శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చేస్తాం: రాచకొండ సీపీ

ఇదీ చదవండి: చల్లారని గ్రామస్థుల ఆగ్రహజ్వాలలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.