ETV Bharat / state

నారసింహుని జన్మ నక్షత్రం.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు - యాదాద్రి ఆలయ వార్తలు

నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు.

స్వాతినక్షత్రం పురస్కరించుకొని యాదాద్రి నారసింహునికి ప్రత్యేక పూజలు
స్వాతినక్షత్రం పురస్కరించుకొని యాదాద్రి నరసింహునికి ప్రత్యేక పూజలు
author img

By

Published : Feb 4, 2021, 10:55 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు.... గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు.

స్వాతినక్షత్రం పురస్కరించుకొని యాదాద్రి నారసింహునికి ప్రత్యేక పూజలు
స్వాతినక్షత్రం పురస్కరించుకొని యాదాద్రి నరసింహునికి ప్రత్యేక పూజలు

బాలాలయ మండపంలో శత కళశాలను ఏర్పాటు చేసి... జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాల నడుమ స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. భక్తులకు లఘుదర్శన సౌకర్యం కల్పించారు. స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: జాతర సమయం తరుముకొస్తోంది.. పని మొరాయిస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.