ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఆరాధిస్తూ నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సుప్రభాతంతో శ్రీ స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి పూజలకు తెరతీశారు. హారతి నివేదించి బాలభోగం, బిందెతీర్థం చేపట్టారు.
పాలతో అభిషేకించి సహస్ర నామాలు పఠిస్తూ... తులసీ పత్రాలతో అర్చించారు. వేద మంత్రాల మధ్య సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణోత్సం జరిపారు. అలంకృతులైన శ్రీ స్వామి, అమ్మవార్లను గజవాహనంపై అధిష్ఠింపజేసి సేవోత్సవాన్ని కొనసాగించారు. చరమూర్తుల మందిరంలో రామలింగేశ్వరుడిని అర్చిస్తూ ప్రత్యేక పూజలు జరిగాయి. పార్వతీ దేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సేవోత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తుల జయజయధ్వానాలు, భజనల మధ్య పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: ఎవరికీ దక్కని ఆధిక్యం.. అతిపెద్ద పార్టీగా తెరాస