యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా 11,12 న స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగితే, ఆ తప్పులు చెరిగిపోవటం కోసం శాస్త్రబద్ధంగా ప్రతీ ఏటా పవిత్రోత్సవాలను నిర్వహిస్తామన్నారు ఆలయ అర్చకులు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
ఇవీ చూడండి: ఇందూరులో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం