ETV Bharat / state

యాదాద్రి నరసింహుడికి నిత్యారాధనలు

author img

By

Published : Aug 15, 2020, 5:10 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శ్రావణమాసం, శనివారం నిత్యారాధనలతో పాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నిత్య కైంకర్యాలలో భాగంగా, దర్శనమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, మహామండపంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, నిత్యకళ్యాణ పర్వాలు కొనసాగాయి.

Special Pooja In Sravanam Ekadashi At yaadadri Narasimha Swamy Temple
యాదాద్రి నరసింహుడికి నిత్యారాధనలు!

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలాలయ మండపంలో విగ్రహ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మాసం శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించడం ఆనవాయితీ.

ఆ ప్రకారం ఆలయ అర్చకులు స్వామివారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. శ్రీ సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకళ్యాణం ఆన్​లైన్ ద్వారా బుకింగ్ చేసుకుని నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకున్నారు.

ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.