యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసుల దాడులు చేసి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. నిందితులు భువనగిరి పట్టణానికి చెందిన రవ్వ ఆనంద్, బీ ఆనంద్, ఎండీ లియాకత్ అలీఖాన్, గిరిగా గుర్తించారు. నిందితుల నుంచి రూ. 8110 నగదు, నాలుగు చరవాణులు, ఒక సెట్ ప్లేయింగ్ కార్డ్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నలుగురు నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
ఇదీ చూడండి: 'తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ'