ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విషపూరితమైన పాలు తయారు చేస్తున్న స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. 70 లీటర్ల కల్తీ పాలు, 5 లీటర్ల ఆయిల్ డబ్బా, 36 ప్యాకెట్ పౌడర్లు, ఒక మిక్సర్, కూల్ ఫ్రీజ్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రాజు వర్మ తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. నిందితున్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: అర్ధరాత్రి హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌పై దాడి