Soil for is our soul:యువతకు వ్యవసాయ ప్రయోజనాలు. దాని ప్రాముఖ్యతను తెలిపేందుకు కృషి చేస్తోన్న సాయిల్ ఫర్ ఈజ్ అవర్ సోల్ సంస్థ. ఇందుకు గాను యాదాద్రి భువనగిరి జిల్లా నాగినేనిపల్లిలో 18 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ నేటితరం యువతకు వ్యవసాయం అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయ ప్రయోజనాలను విద్యార్థులకు క్షేత్రస్థాయిలో తెలిపేందుకై తాజాగా వ్యవసాయ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది.
farm festival in naginenipally: వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఫాం ఫెస్ట్... నేచురల్ ఫామింగ్ ఎడ్యుకేషనల్ ట్రిప్ సందడిగా సాగింది. హైదరాబాద్ ఆధారిత "మై డ్రీం - గ్రీన్ హోం" అంకుర కేంద్రం సహకారంతో వ్యవసాయం, వరి నాటు వేయడం, సంప్రదాయ ఆహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సమీకృత వ్యవసాయంలో వరి సహా అదనపు ఆదాయం ఇచ్చే అరటి వంటి పండ్ల తోటలు, అపారాలు, జొన్న, కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు.
''వ్యవసాయ పండుగను నిర్వహించడం జరిగింది. ఈ పండుగలో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. రైతుల కష్టాన్ని గుర్తించడం గురించి.. పిల్లలకు చెబుతున్నాం. జంక్ ఫుడ్ వద్దు.. సేంద్రియ ఫుడ్ గురించి పిల్లలకు చెబుతున్నాం..'' -రాకేష్ నగునూరి, భాగస్వామి, సాయిల్ ఈజ్ అవర్ సోల్ సంస్థ
కాంక్రీట్ జంగిల్కే పరిమితపోయిన విద్యార్థులు ఈ చక్కటి ఆహ్లాదకర వాతావరణం నడుమ పల్లె ప్రకృతి ఆస్వాదించారు. ఎటు చూసిన పచ్చదనం, పంట పొలాలు, రైతుల తమ పనులు చేసుకోవడం, వరి నారు, మడులు, నీరు, బురద చూసి పిల్లలు కేరింతలు కొడుతూ చిందులు వేశారు. పొలం మడిలో నృత్యాలు చేశారు. బురదలో వాలీబాల్, రోప్ గేమ్, కబడ్డీ, ఇతర ఆటలు ఆడారు. కొందరైతే ఏకంగా మడ్ బాత్ చేసి పరవశించిపోయారు.
సాధారణంగా నేటితరం విద్యార్థులకు వ్యవసాయం, పంటల సాగు, విత్తనాలు, నాట్లు, విత్తనం విత్తడం, మొక్కలు ఎలా పెరుగుతాయి.? రోజూ తీసుకునే అల్పాహారం, భోజనం, పాలు వంటి ఎలా వస్తాయో కూడా వారికి తెలియదు. ఈ నేపథ్యంలో పర్యావరణం, భూగర్భ జలాలు, సాగు, తాగునీటి ప్రాధాన్యత, పంటకోతలు, నూర్పడి, శుద్ధి,నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలు స్వయంగా తెలుసుకోగలిగామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ముందు నాకు రావాలి అనిపించలేదు. మా అమ్మ బలవంతంగా తీసుకువచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాం. మా అమ్మ అకాడమీ తరుఫున.. నేను ఒక్కదాన్ని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. వాళ్లు కొన్ని పాడి ప్లాంట్స్ ఇచ్చారు. మేం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటే.. పంటలు ఎలా పండిస్తారో చూశాం. నేను నాటేస్తే.. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మొక్కలు నాటాను కూడా. నాకు చాలా మంచిగా అనిపించింది. - విద్యార్థులు
ఈ తరహా వ్యవసాయ పండుగ పేరిట విద్యార్థులకు అవగాహన కల్పించడంతో వారిలో విజ్ఞానం పెరుగుతుంది. కీలక సేద్యం, క్షేత్రంలో పడే కష్టం తెలిసి అదేశానికి అన్నం పెట్టే కర్షకులపై మంచి గౌరవడం ఏర్పడటం, ఆహార వృథా తగ్గిపోవడం వెరసి పర్యావరణం, భూమి, భూగర్భ జలాల పరిరక్షణ ఇప్పట్నుంచే అలవడుతుందని వ్యవసాయ ఇంజనీరింగ్ పట్టభద్రులు చెబుతున్నారు.
ఫామ్ ఫెస్ట్.. పిల్లలకు వరి అంటే ఏమిటి.. అది ఎలా పెరుగుతుంది. అనే చెప్పడం కోసం.. ఇది నిర్వహించాం. పిల్లలకు అవగాహన కల్పించడం కోసం.. ఇది ఏర్పాటు చేశాం. పిల్లలు అందరు చాలా ఆనందంగా ఉన్నారు. బాగా ఎంజాయ్ చేశారు. - ఎంవీఎస్ బాలరాజు, ఫాం సూపర్వైజర్
మై డ్రీం - గ్రీన్ హోం: గ్రామీణ భారతావనిలో అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దృష్ట్యా సేంద్రీయ, సహజ సేద్య పద్ధతులు విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్లాలన్నది "సాయిల్ ఈజ్ అవర్ సోల్", "మై డ్రీం - గ్రీన్ హోం" లక్ష్యం. ఇప్పట్నుంచే పిల్లల్లో ఫాం ఎడ్యుకేషన్ ద్వారా ఆసక్తి, జిజ్ఞాస కల్పించేందుకు కృషి చేయడమే కాకుండా అగ్రి పట్టభద్రులకు క్రాప్ సైకిల్ నేర్పించి ఇంటర్షిప్ ఇస్తామని ఆ సంస్థ పేర్కొంది.
ఫాం ఎడ్యుకేషన్ టూర్: వ్యవసాయ ఇంజనీరింగ్ పట్టభద్రులు "ఫాం ఎడ్యుకేషన్ టూర్" పేరిట పర్యాటకం సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇక నుంచి తరచూ ఈ తరహాలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రసాయన అవశేషాల్లేని వ్యవసాయ, ఉద్యాన పంటలు, మాంసం ఎలా ఉత్పత్తిలో చేయవచ్చో తెలియజేస్తున్నారు. దీంతో పాటు అగ్రి టూరిజం అభివృద్ధి చేయడమే సాయిల్ ఈజ్ అవర్ సోల్ సంస్థ లక్ష్యం.
ఇవీ చూడండి: