యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో అపశృతి జరిగింది. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మించేందుకు టిప్పర్ ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి సమయం కావడం వల్ల డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా వాహనాన్ని మలిపాడు. ఈ క్రమంలో టిప్పర్ వెనుకభాగం తగిలి రోడ్డుపక్కనున్న గోడ కూలిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. కూలిన గోడను పునరుద్ధరించేందుకు కాంట్రాక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి వర్షానికే గోడ కూలిపోయే స్థితిలో ఉందని... కాంట్రాక్టర్ల పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. స్థానిక భాజపా కార్యకర్తలు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఉల్లి గోదాములపై దొంగల కన్ను.. లక్షల్లో స్వాహా