సాధ్యమైనంత త్వరగా యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తిచేయాలన్న... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారులు పనులను వేగవంతం చేశారు. పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయం తొలి ప్రాకారంలోని యాదాద్రి ఆలయం ద్వారాలు, తలుపులకు వెండి తొడుగుల పనిని... జనగామ జిల్లా పెంబర్తికి చెందిన విశ్వకర్మ హస్తకళాకారులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు పెంబర్తికి చెందిన విశ్వకర్మలకు 74.20 కిలోలు, హస్తకళాకారులకు 61.81 కిలోల వెండి యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, వంశపారంపర్య ఛైర్మన్ నరసింహామూర్తి అందించారు.
ఇదీ చూడండి: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం