ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాశివునికి నిత్యహవనం, పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. రాత్రంతా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.