యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. దేవాలయానికి పడమర ముఖద్వారం ఉండడం, రెండు.. హోళీ రోజు శివ పార్వతుల కల్యాణం జరగడం.
ఇలా విభిన్నంగా జరగడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. శివుని తపస్సు భగ్నం చేసేందుకు మన్మథుడు తన ప్రేమ బాణం సందించాడు. శివుని ఆగ్రహానికి గురైన మన్మథుడు దహనమైపోయాడు. అర్ధనారీశ్వరుల కోసమే కాముడు అగ్నికి ఆహుతయినందున హోళీ రోజే శివ పార్వతుల కల్యాణం నిర్వహిస్తారు.