యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట, మండలంలోని రేణికుంట, నెమిల గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం నష్టాన్ని మిగిల్చింది. వాన కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. టార్పాలిన్లు కప్పే ప్రయత్నం చేసినప్పటికీ గాలుల ధాటికి కొట్టుకుపోయి తంటాలు పడ్డారు.
మొత్తంగా 12 విద్యుత్తు స్తంభాలు విరిగిపోగా.. ఐదు నియంత్రికలు నేలకొరిగినట్లు డిస్కం ఏఈ వెంకటేశం తెలిపారు. వర్షం వల్ల మండలంలో గంటలపాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు వృక్షాలు రోడ్డుపై, ఇళ్లపైన విరిగి పడ్డాయి. తీవ్ర ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి.