యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రెండో విడత గొర్రెల పంపిణీను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 1,810 మంది లబ్ధిదారులు రూ.5,65,62,500 చెల్లించి ఏడాది గడుస్తున్నా ఇంకా గొర్రెలను అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీడీసీ ద్వారా గతంలో ఇచ్చిన రుణాలను మాఫీ చేసి డాక్యుమెంట్లు తిరిగివ్వాలని కోరారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండిః ట్రంప్ చెణుకుకు మోదీ సమాధానమేమిటో తెలుసా!