రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా... స్వామివారిని గోవర్ధనగిరిదారిగా అలంకరించి... బాలాలయంలో ఊరేగించారు. వజ్ర వైఢూర్యాలతో అలంకరించారు. నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు.
ఆలయ అర్చకులు... మేళతాళాలు, మంగళ వాద్యాల హోరు నడుమ, వేదపండితుల వేదపారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోవర్ధనగిరి అవతార విశిష్టతను తెలిపారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ సాయం లేకున్నా కుంభమేళా నిర్వహిస్తాం'