యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురంలో సర్పంచ్ బీర్ల శంకర్ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన 'కొవిడ్ ఐసోలేషన్ సెంటర్'ను ఎంపీపీ చీర శ్రీశైలం ప్రారంభించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేసుకోలేని వారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
తన ఆలోచనతో ఏకీభవించిన పాలకవర్గం.. కరోనా బాధితులకు వైద్య సదుపాయాలతో పాటు భోజన సదుపాయాన్ని కూడా కల్పించింది. బాధితులు ఇక్కడే చికిత్స తీసుకోవాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. అసలైన నాయకుడిగా వ్యవహరించిన సర్పంచ్ పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: 'పదవిని కాపాడుకోవాలనే ఆరాటంతోనే కేంద్రంపై ఈటల విమర్శలు'