shantha biotech donation to yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదోరోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4న స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 14వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.
Yadadri brahmotsavam: ఐదోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని మురళీకృష్ణుడి అలంకారంలో సేవపై వజ్రవైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో.. నయనమనోహరంగా, ముగ్దమనోహరంగా అలంకరించారు. వేదమంత్రాలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ మురళీకృష్ణుడి అలంకార విశిష్టత తెలియజేశారు.
![Yadadri brahmotsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14673213_710_14673213_1646742348255.png)
శాంత బయోటెక్ ఛైర్మన్ విరాళం
shantha biotech chairman visit: ఈరోజు(మంగళవారం) లక్ష్మీ నరసింహ స్వామిని శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి దర్శించున్నారు. స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి కోటి ఎనిమిది లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఆలయ ఈవో గీతకు అందించారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా బాలాలయంలో మురళీకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చిన స్వామి వారి ఊరేగింపులో వరప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
'కొన్ని క్షేత్రాలను దర్శిస్తే మంచిదని పూరాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న దివ్యక్షేత్రం యాదాద్రి నరసింహస్వామి క్షేత్రం.ఇక్కడ స్వామివారు స్వయంభువు అని పురాణాల్లో ఉంది. ఆ విశ్వాసంతోనే ఎలాంటి ఏర్పాట్లు లేనప్పుడే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పుణ్యఫలాలు పొందేవారు. ఆనాటి జనాభాతో పోల్చితే నేడు ఎన్నో రెట్లు అధికంగా వెళుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలు ప్రభుత్వం చేపడుతుంది. ఎక్కువ సంఖ్యలో గెస్ట్ హౌస్లను నిర్మించింది. వాటిలో పేదవారు ఉండకపోవచ్చు కానీ అలాంటి వారికి సమయానికి అన్నం పెట్టే అవకాశం దేవస్థానం కల్పిస్తుంది. దానికి మావంతుగా ఏదైనా చేద్దామనే నేడు స్వామివారికి విరాళం ఇచ్చాము.'
-వరప్రసాద్ రెడ్డి , శాంతా బయోటెక్ అధినేత
ఆలయంలో మహిళాదినోత్సవం
![Yadadri brahmotsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14673213_y3.jpg)
అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆలయ ఈవో గీత దేవస్థానంలో పనిచేసే మహిళా ఉద్యోగులు, మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకి కండవాలు కప్పి సన్మానించారు. స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు.
ఇదీ చదవండి:Polluting industries : ఐదు కాలుష్యకారక పరిశ్రమల మూసివేత