ఆదివారం కావడం వల్ల యాదాద్రీశుడి ఆలయం కిటకిటలాడింది. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డు, ప్రసాద కౌంటర్లు రద్దీగా ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల స్వామివారి సర్వ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలు అనుమతించలేదు.
ఇదీ చూడండి : అమ్మవారికి బోనం సమర్పించిన నటి పూనమ్ కౌర్