రాష్ట్రానికి వన్నె తెస్తున్న యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్ట పరిధిలోని ఆలయ ప్రవేశ కనుమ వద్ద దారిని విస్తరించి తారు వేసే పనులను బుధవారం చేపట్టారు.
గుట్ట నుంచి తుర్కపల్లి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతమైంది. ప్రస్తుతం వైకుంఠ ద్వారం ముందు భాగంలో ఆర్ అండ్ బి అధికారులు పనులను ప్రారంభించారు. వైకుంఠ ద్వారం నుంచి మొదటి ఘాట్ రోడ్ వరకు రోడ్డును విస్తరించేందుకు చదును చేసే పనులను భారీ యంత్రాల సహాయంతో అధికారులు సిబ్బందితో చేయిస్తున్నారు.
ఇటీవలే ఆ రోడ్డు మార్గంలో భారీ కల్వర్టు నిర్మించిన అధికారులు వేగంగా రోడ్డు పనులు చేస్తున్నారు. ఇదే మార్గం గుండా యాదాద్రి కొండ పైకి భక్తులు తమ వాహనాల్లో వెళ్తున్నారు. కాబట్టి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచారు.
యాదాద్రికి వచ్చే భక్తులకు, ఆహ్లాదకరంగా ఉండేందుకు రోడ్డు వెంట చెట్లు మరియు మొక్కలు, గ్రీనరీనీ పెంచుతున్నారు. అదేవిధంగా రోడ్డుకిరువైపులా డ్రైనేజీ వాటర్ వెళ్లడానికి వీలుగా పనులను చేస్తూ రోడ్డు పనులను చేపడుతున్నారు. భక్తజనుల అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన రోడ్లతో, సుందరీకరణగా ఉండే విధంగా పనులు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన