ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో పోతిరెడ్డిపాడు వాసి మృతి - pothireddypadu

యాదాద్రి భువనగిరి జిల్లా రహీంఖాన్​పేట్​ వద్ద కల్వర్టు ప్రమాద సూచికను ఢీకొని పోతిరెడ్డిపాడుకు చెందిన నవీన్​ మృతిచెందాడు. కల్వర్టు నిర్మాణాల వద్ద రక్షణ కంచెలు లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపాడు వాసి మృతి
author img

By

Published : Jul 14, 2019, 10:48 AM IST

రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపాడు వాసి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్​పేట వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. భువనగిరి-మోత్కూరు రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు ప్రమాద సూచికను ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మక్తాల నవీన్​గా పోలీసులు గుర్తించారు.

భువనగిరిలో లారీ డ్రైవర్​గా పనిచేస్తున్న నవీన్​ విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరుగు పయనమయ్యాడు. కల్వర్టు వద్ద ఏర్పాటుచేసిన ప్రమాద హెచ్చరిక సూచికను ఢీ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినా ఉదయం వరకు ఎవరూ దాన్ని గమనించలేదు. ఉదయం 7 గంటల సమయంలో అటువైపు వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

కల్వర్టు నిర్మాణం చుట్టు ఎటువంటి రక్షణ కంచెలు ఏర్పాటుచేయకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: పారిపోయాడు... దొరికిపోయాడు...

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
యాంకర్ వాయిస్: నిర్మాణం లో ఉన్న రోడ్డు కల్వర్ట్ కు ఢీ కొని వ్యక్తి మృతి.
Body:
యాంకర్: యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(యం) మండలం రహీంఖాన్ పేట వద్ద భువనగిరి నుండి మోత్కూరు వెళ్ళే రహదారి లో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్ట్ వద్ద ప్రమాద సూచిక బోర్డుకు తగిలి పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మక్తాల నవీన్ (32) అనే యువకుడు మృతిచెందాడు.
వివరాల్లోకి వెల్లితే మృతుడు నవీన్ కు భార్య కూతురు కుమారుడు కలడు.
మోత్కూరు లో నివాసం ఉంటూ భువనగిరి లో లారీ డ్రైవర్ గా పనిచేస్తు పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి 12గం సమయంలో రోడ్డుపై పుననిర్మస్తున్న కల్వర్టు సూచిక బోర్డును వేగంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఉదయం 7గంటలవరకు ఈ ప్రమాదాన్ని ఎవ్వరూ గమనించలేదు. తరువాత వెళుతున్న ప్రయాణికులు ఈ ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
కల్వుర్టు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి కాల్వర్టు నిర్మాణం చుట్టు సరైన ఎలాంటి రక్షణ వలయాలు ఏర్పాటు చేయలేదని కల్వర్టు నిర్మాణంలో ఉన్నట్లు కనిపించే విధంగా ప్రమాద సూచికలు లెకపోవడంతో ఇక్కడ తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.