యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను యాడా అధికారులు వేగవంతం చేశారు.
ప్రధాన మండపంపై ఏర్పాటు చేసిన నంది విగ్రహాల వల్ల ఆలయం మరింత సుందరంగా కనిపిస్తోంది. శివాలయం ముందు భాగంలో ధ్వజస్తంభం, బలిపీఠం, పద్మాన్ని శిల్పులు ఏర్పాటు చేస్తున్నారు.
మరొకవైపు... విష్ణు పుష్కరిణి పనులను కూడా అధికారులు వేగవంతం చేశారు. పుష్కరిణిలోని మండపంపై పిల్లర్లు ఏర్పాటు చేశారు. కృష్ణ శిలతో చేస్తున్న ఈ మండపం పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లు యాడా అధికారులు తెలిపారు.