రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి.. ఆశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపడుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాదాద్రి ఆలయాన్ని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదని అన్నారు.
- ఇదీ చూడండి : పంచారామాలు: శివాయ విష్ణు రూపాయ..