ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకుంటున్నందున యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారులు రబీ సీజన్ కోసం ప్రణాళికలు రూపొందించారు.
యాసంగిలో పంటలు సాగుచేసే విస్తీర్ణం
వరి 44,210 హెక్టార్లు
జొన్నలు, మొక్కజొన్నలు 100 హెక్టార్లు
పెసర్లు, మినుములు 100 హెక్టార్లు
ఉలవలు 150 హెక్టార్లు
మిరప 15 హెక్టార్లు
ఇతర ఆహార పంటలు 2,043 హెక్టార్లు
చిరుధాన్యాలనూ పండించేలా చర్యలు..
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని తెస్తున్నందున యాసంగిలోనూ చిరుధాన్యాలను పండించేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. వర్షాలు బాగా కురుస్తుండటం, చెరువులు, కుంటలు నిండుతున్నందున సాగు విస్తీర్ణం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.
యూరియాకు తయారైన ఇండెంట్లు..
జిల్లా వ్యాప్తంగా 12,479 మెట్రిక్ టన్నుల యూరియా, 4,775 మెట్రిక్ టన్నుల డీఏపీ, 7,640 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రబీ సీజన్లో అవసరమవుతుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో యూరియా, డీఏపీ కష్టాలను చవిచూసిన అన్నదాతలకు యాసంగిలో ఇప్పటికే ఇండెంట్లను సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ వెల్లడించారు.
సరిపడా విత్తనాలూ సిద్ధం..
వరి 4,631 క్వింటాళ్లు, మినుములు 292 క్వింటాళ్లు, జొన్నలు 73 క్వింటాళ్లు, మొక్కజొన్నలు 583 క్వింటాళ్లు, సన్‌ఫ్లవర్ 53 క్వింటాళ్లు... ఇలా అన్ని రకాల పంటల విత్తనాలు కలిపి 6,606 క్వింటాళ్ల విత్తనాలను సీజన్ ఆరంభం నాటికి సిద్ధం చేశారు. మొత్తానికి జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పంటల దిగుబడిని పెంచే దిశగా కార్యచరణ ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు.
ఇదీ చదవండిః యాసంగిలో 40 లక్షల ఎకరాల సాగే లక్ష్యం...