సూర్యాపేట జిల్లా నూతనకల్‌కు చెందిన బొబ్బా వీరారెడ్డి కుటుంబసభ్యులు 9మందికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో క్వారంటైన్ ముద్ర వేశారు. వీరు గత నెలలో లాక్డౌన్ ప్రకటించగానే స్వగ్రామం నూతనకల్‌కు వెళ్లారు. ఇటీవల సూర్యాపేట జిల్లాను ఆరెంజ్ జోన్‌గా ప్రకటించగా... అక్కడ అంత సురక్షితం కాదని తిరిగి చౌటుప్పల్‌కు వచ్చారు.
చౌటుప్పల్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న... వీరిని గమనించి స్థానికులు డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. వైద్యుల బృందం వచ్చి... వారిని మందలించి, బయటికి రావద్దొని సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎవరూ వెళ్లొద్దని డాక్టర్ శివప్రసాద్ అన్నారు. కరోనా లక్షణాలు అందరిలో కనిపించవు కానీ ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందుతుందన్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు.
ఇదీ చూడండి: కరోనా హాట్‌స్పాట్‌కు వెళ్లారని ఇంట్లోకి నో ఎంట్రీ!