ETV Bharat / state

అక్రమ అరెస్టులను నిరసిస్తూ వలిగొండలో భాజపా ఆందోళన - potest of bjp activitsts in valigonda

తమపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భాజపా నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ… సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కమలం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు.

protest on illegal arrests by bjp activitsts in valigonda
అక్రమ అరెస్టులను నిరసిస్తూ వలిగొండలో భాజపా ఆందోళన
author img

By

Published : Nov 2, 2020, 5:23 PM IST

తమపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భాజపా నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

కమలదళం ఆందోళనతో ట్రాఫిక్​కి అంతరాయం కలిగింది. అలాగే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కార్యకర్త శ్రీనివాస్ కోలుకోవాలని వలిగొండలో రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించి.. గుడి ఆవరణలో మౌనదీక్ష చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: లారీలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్​ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.