కాంట్రక్ట్ లెక్చరర్ల అరెస్టులను ఖండిస్తూ యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్ ముందు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నిరసనకు దిగారు. నేడు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించాల్సిన యాత్రను పోలీసులు అడ్డగించి కాంట్రాక్ట్ లెక్చరర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ బదిలీలు చేపట్టాలని భువనగిరి నుంచి హైద్రాబాద్ వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు చేపట్టిన మహా పాదయాత్రను భువనగిరి పోలీసులు భగ్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కాంట్రాక్ట్ లెక్చరర్ల పాదయాత్ర.. అడ్డుకున్న పోలీసులు..