ETV Bharat / state

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆలేరు యువకుడు - కిలిమంజారో పర్వతంపై ఆలేరు ప్రదీప్​

ఆలేరు యువకుడు ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించాడు. ప్రదీప్​ సాహసాన్ని స్థానికులు అభినందించారు.

కిలిమంజారో శిఖరాగ్రంపై ఆలేరు యువకుడు
కిలిమంజారో శిఖరాగ్రంపై ఆలేరు యువకుడు
author img

By

Published : Jan 10, 2021, 6:48 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని క్రాంతినగర్​కు చెందిన బిరుకురి ప్రదీప్​ ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. బీటెక్​ చదివిన ఈ యువకుడు ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోని టాంజానియా వెళ్లారు. సంక్రాంతికి స్వగ్రామానికి బయలుదేరే ముందు ఈ నెల 4న నైజీరియా నుంచి 66కి.మి. దూరంలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరారు. 9న ఉదయానికల్లా విజయవంతంగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. సగర్వంగా భారత జాతీయ పతాకాన్ని చేతబూనారు.

ఇందుకు గాను అక్కడి 'మంకీ అడ్వెంచర్​ ట్రావెల్​ ఏజెన్సీ' సహకారం తీసుకున్నారు. ప్రదీప్​ తల్లి సులోచన దినసరి కూలీ. తండ్రి శ్రీశైలం పక్షవాతంతో మంచం పట్టారు. ప్రదీప్​ సాహసాన్ని స్థానికులు అభినందించారు.

ఇదీ చూడండి: తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా.. యుద్ధప్రాతిపదికన సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.