యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా మెుదలైంది. జిల్లాలో మొత్తం ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు . పాలిసెట్ పరీక్షకు నిమిషం నిబంధన అమల్లో ఉంది. పలు కేంద్రాల్లో చివరి నిమిషంలో విద్యార్థులు పరిగెత్తుకుంటూ పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా పాలీసెట్ - 2019 పరీక్ష ప్రారంభం