ETV Bharat / state

కరోనా బాధితుల కోసం కదిలి వచ్చిన ఎస్సై

తిండి కోసం ఆ ఇంటివారు అలమటించిపోయారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితితో అల్లాడిపోయారు. సాటి మనిషి పట్ల కనికరం చూపని కాలనీ వాసులుతో విసిగిపోయారు. వేరే దిక్కు లేక స్థానిక పీఎస్​కు కాల్​ చేశారు. పెద్ద మనసుతో ముందుకొచ్చిన ఎస్సై.. ఆ కొవిడ్​ బాధితులకు నిత్యావసరాలతో పాటు కావాల్సినంత ధైర్యమిచ్చి వెళ్లారు.

police helps covid effected people
police helps covid effected people
author img

By

Published : Apr 25, 2021, 10:54 PM IST

యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఓ కరోనా బాధితుడి కుటుంబం.. హోం క్వారంటైన్​లో ఉంటూ నిత్యావసరాలు లేక ఆకలితో అలమటించిపోయింది. సాటి మనిషి పట్ల.. దయ, కరుణ చూపని కాలనీ వాసులతో మనోవేదనకు గురైంది. ‘మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. దయచేసి సాయం చేయండి’ అంటూ స్థానిక పీఎస్​కు ఫోన్ చేసింది. స్పందించిన ఎస్సై.. నేనున్నానంటూ ముందుకొచ్చి బాధితులకు నిత్యావసరాలు అందజేశారు.

బాధితుల ఆకలి తీర్చిన ఎస్​ఐ మధుబాబుకు.. ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా.. ఎస్సై చేసిన మంచి పనికి ప్రత్యేకంగా అభినందించారు. కొవిడ్ బాధితుల పట్ల అందరూ సానుభుతి చూపాలని... ఆపత్కాలంలో వారిని ఆదుకోవాలని ఎస్సై మధుబాబు సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.