అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని... యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి సర్పంచ్ గోపాల్ దాస్ బిక్షమమ్మ ఆరోపించారు. బిక్కేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న కాంట్రాక్టర్లను అడ్డుకోవటంతో సీఐ బాలాజీ వరప్రసాద్ తనపై అసభ్యపదజాలం ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
బండకొత్తపల్లి సర్పంచ్ మాటలను సీఐ ఖండించారు. కలెక్టర్ ఆదేశానుసారం జరుగుతున్న బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకోవటం వల్లే గోపాల్ దాస్ బిక్షమమ్మను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించలేదని... కావాలనే అలా తప్పుడు ఆరోపణలు చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!