కరోనా కట్టడికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల కోసం వస్తున్న వ్యక్తుల నుంచి వ్యాపారస్తులకు కరోనా సోకకుండా దుకాణం ముందు బకెట్లో నీరు, సబ్బు ఉంచి చేతులు శుభ్రంగా కడిగి వస్తువులు కొనుగోలు చేయాలని పోలీసులు నిబంధన విధించారు. కిరాణ దుకాణాల ముందు సామాజిక దూరం పాటించేలా ముగ్గులు వేశారు.
కొందరు ప్రజాప్రతినిధులు నిరుపేదలకు ఉచితంగా మాస్కులు అందించారు. భారత్ గ్యాస్ ఏజన్సీవారు గ్యాస్ సిలిండర్ను తీసుకెళ్ళేవారికి ఉచితంగా మాస్కులు, గ్లౌవ్స్ అందించి వారి ఉదారతను చాటుకుంటున్నారు. పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎవరైనా బయటకి వస్తే పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మాస్కులు లేనివారు విధిగా ధరించాలని సూచిస్తున్నారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'