యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనాపై వాట్సప్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్న యువకులని భువనగిరి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు మెసేజ్‌లను సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఫార్వర్డ్ చేసినా సెక్షన్ 54 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
భువనగిరిలోకి కరోనా వచ్చిందంటూ వదంతులు సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు యువకులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వీయ పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: కరోనా @110: భారత్‌ను కలవరపెడుతోన్న కొవిడ్-19 కేసులు