పాత కక్షలు మనసులో పెట్టుకుని హత్య చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్ పేటకు చెందిన దండుగుల యాదగిరి, దండుగుల రమేష్, దండుగుల దేవేందర్, దండుగుల వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 7న దండుగుల యాదగిరి, మందుగుల వెంకటేష్ కుమారులు గొడవ పెట్టుకోవడం వల్ల దండుగుల యాదగిరి తన సోదరులతో మందుగుల వెంకటేష్‌పై కర్రలు, రాడ్డుతో దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను హైద్రాబాద్ ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. దాడికి పాల్పడిన వారిలో నలుగురిని అరెస్ట్ చేయగా.. దండుగుల వెంకటేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దండుగుల యాదగిరి అమ్మ సర్పంచ్‌గా పోటీ చేసిందని డీసీపీ వివరాలు వెల్లడించారు. ఆ ఎన్నికల్లో ఓటమితో బంధువులైన మందుగుల వెంకటేష్ తన కుటుంబసభ్యులు ఎన్నికల్లో సహకరించక ఓటమికి కారణమయ్యాడని దండుగుల వెంకటేష్‌ను నిందించాడు. ఈ నేపథ్యంలో తరచూ అతనితో గొడవలు పెట్టుకునేవాడు. గతంలో ఇరువురు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు.
ఇదీ చూడండి : బైక్ లేకున్నా ఫొటో పెట్టి రూ.30 వేలు అన్నాడు... రూ.73వేలు దోచాడు