యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరులో ప్రజలని జాగృతం చేయడానికి పోలీసులు కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఇప్పుడు ప్రముఖంగా జరుగుతున్న నేరాలు.. అమ్మాయిలపై అఘాయిత్యాలు, దొంగతనాలు, పిల్లల అపహరణ, మద్యపానానికి బానిసై కుటుంబాలను ఛిద్రం చేసుకోవడం, రోడ్డు ప్రమాదాల బారిన యువత బలికావడం వంటి పలు అంశాలపై కళాకారులు నటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
సమాజంలో జరిగే ఇలాంటి ఘటనలు ఆపాలంటే పోలీసులకు ప్రజల నుంచి సంపూర్ణ, మద్దతుతోనే సాధ్యపడుతోందని ఎస్సై శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగిత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ వీరారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్