యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు.. నిరంతరం సేవలు చేస్తున్న సిబ్బందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి దాతృత్వం చాటుతున్నారు. స్వయంగా ఇంట్లో వండిన ఆహారాన్ని ప్యాకెట్లుగా చేసి రోజూ దాదాపు 200 మంది పారిశుద్ధ్య, పోలీసులు సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు.
పప్పు అన్నం, ఆలుబిర్యానీ, పులిహోర, దద్దోజనం ఇలా రోజుకో రకం భోజనాన్ని వారికి అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తామని మాధవాచార్యులు తెలిపారు. కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం