ETV Bharat / state

Yadadri: యాదాద్రిలో ఐదోరోజు వైభవంగా పంచకుండాత్మక మహాయాగం

Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఐదోరోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా క్రతువులు చేపట్టారు.

Yadadri: యాదాద్రిలో ఐదోరోజు వైభవంగా పంచకుండాత్మక మహాయాగం
Yadadri: యాదాద్రిలో ఐదోరోజు వైభవంగా పంచకుండాత్మక మహాయాగం
author img

By

Published : Mar 25, 2022, 6:15 PM IST

Yadadri: విశ్వశాంతి కోసం నారసింహుడు భక్తవత్సలుడిగా వెలసిన యాదాద్రి క్షేత్రంలో ఒకవైపు మహాయాగం.. మరోవైపు సంప్రోక్షణకు సంబంధించిన సంప్రదాయ పర్వాలతో ఆధ్యాత్మికోత్సవం నెలకొంది. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా ఐదో రోజు పంచకుండాత్మక యాగం కొనసాగుతోంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా క్రతువులు చేపట్టారు. ఇవాళ ఉదయం 9గంటలకు శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్రహావనములు నిర్వహించారు.

వైభవంగా పంచకుండాత్మక మహాయాగం
వైభవంగా పంచకుండాత్మక మహాయాగం
స్వామి వారికి కలశాభిషేకం
స్వామి వారికి కలశాభిషేకం

మధ్యాహ్నం 1.30గంటలకు కలశాభిశేకం, నిత్య లఘుపూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూలమంత్రహావనములు, పంచామృతాధివాసం, నిత్యా లఘుపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.

పూజాధికాలు నిర్వహించిన అర్చకులు
పూజాధికాలు నిర్వహించిన అర్చకులు

ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర: పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు కొండపైన బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర ఉంటుందని ఆలయ ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. ఆ రోజు ఉ.11.55 గంటలకు స్వయంభువు మినహా ప్రతిష్ఠామూర్తులు, కలశాలకు ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు. కొండ కింద ఉత్తర దిశలో నిర్మితమైన పైవంతెనను 26న ప్రారంభించనున్నారు.

లక్ష్మి పుష్కరిణి సిద్ధం: గండి చెరువు వద్ద నిర్మించిన లక్ష్మి పుష్కరిణిని నీటితో నింపి సిద్ధం చేశారు. గోదావరి జలాలతో పుష్కరిణిని నింపాలని ప్రణాళిక రూపొందించినా ట్యాంకుల నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి బోరు నీటితో నింపారు. 28న పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ఆ రోజు మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పించనున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొంటారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.