యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగవుతున్నాయి. కృష్ణశిలతో నిర్మిస్తున్న కట్టడాలు సర్వాంగ సుందరంగా కనువిందు చేస్తున్నాయి. వైష్ణవ ఆచారాల ప్రకారం ఆగమ శాస్త్రం అనుసరిస్తూ.. నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయంలో పలు కైంకర్యాలకు పంచ నారసింహులకు పంచ మండపాలు సకల హంగులతో రూపొందిస్తున్నారు.
పంచ నరసింహుల స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతున్న యాదాద్రిలో ఆలయానికి తూర్పు దిశలో వార్షికోత్సవాల నిర్వహణకు ఒక మండపం, బ్రహ్మోత్సవాల నిర్వహణకు దక్షిణ దిశలో, మహరాజ గోపురం ఎదుట నిత్య సేవోత్సవంలో స్వామి వారు సేదతీరే.. వేంచేపు మండపం, ఆలయ పుష్కరిణిలో ఉత్సవాలు నిర్వహించే మండపాలు పూర్తయ్యాయి. కాగా.. ఐదో మండపమైన నిత్య కల్యాణ మండపం నిర్మాణంలో ఉంది. భక్తుల మనో ఉల్లాసానికి అష్టభుజ మండలం తొలి ప్రాకారంలో అద్దాల మండలం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.