నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన నర్సింగ్ రావు చిన్నతనం నుంచే బొమ్మలు గీయడం అభిరుచిగా మార్చుకున్నాడు. పాఠశాల స్థాయిలో నిర్వహించే చిత్రలేఖన పోటీల్లో ప్రతిభను నిరూపించుకొని ఉపాధ్యాయులను అబ్బురపరిచేవాడు. చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తూనే చాలా మంది ప్రముఖుల ముఖ చిత్రాలను గీసి వారికి జ్ఞాపికగా ఇచ్చారు. చివరికి తన చిత్రకళను జీవన వృత్తిగా మార్చుకున్నాడు.
బొమ్మ గీయడంలో నర్సింగ్‌రావుది అందెవేసిన చేయ్యి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ అచ్చం అలాగే బొమ్మ గీయడంలో నర్సింగ్‌రావుది అందెవేసిన చేయి. ఆయన కుంచెతో ముఖ చిత్రాలు వేయించుకున్న వారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలూ ఉన్నారు. చాలా వరకు క్యాన్వాస్ పెయింటింగ్‌తో బొమ్మలు వేయించుకుంటారు. ఇవి వందేళ్ల వరకు చెక్కు చెదరవు. కార్మికుల కష్టాలు, అందమైన ప్రకృతి చిత్రాలు వేస్తూ కంప్యూటర్‌కూ అందని రీతిలో రంగులు మిక్సింగ్ చేయడంలో ఆయన నేర్పరి. హైదరాబాద్‌లోని ఆస్పత్రులు, దేవాలయాలు, స్థానిక పాఠశాలల్లో నర్సింగ్ రావు గీసిన బొమ్మలే కనిపిస్తుంటాయి. ఏడాది క్రితం స్థానిక కోట గోడపై దేశ నాయకుల చిత్రాలు గీసి అబ్బురపరిచాడు. ఫ్లెక్సీలు లేని కాలంలో బ్యానర్లు రాసి ఇచ్చేవారు. తెలంగాణ ఉద్యమంలో చేతిరాతతో భారీ సైజు బ్యానర్లు, కటౌట్లు రాసి సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. 30 ఏళ్లుగా కళను నమ్ముకొని జీవిస్తున్నానని... టెక్నాలజీ రావడంతో జీవనోపాధి కోల్పోతున్నామని... కళాకారులను ప్రభుత్వం గుర్తించి పాఠశాల స్థాయిలో పెయింటింగ్ టీచర్ల నియామకాలు చేపట్టాలని నర్సింగ్ రావు కోరుతున్నారు.ఇవీ చూడండి: తెలంగాణ జలస్వప్నం..సాకారమాయే....!