భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మిర్యాలగూడకు చెందిన 50 మంది పాదయాత్ర చేపట్టారు. కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ భువనగిరిలోని సాయిబాబా ఆలయం నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నడక ద్వారా చేరుకున్నారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధి అంతం కావాలని కోరుతూ యాదగిరిలక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నామని క్లబ్ సభ్యులు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం యాదాద్రిగుట్టపైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.